రేడియోధార్మిక అయాన్లతో..

వాయువులు మెషిన్‌ ద్వారా ట్రావెల్‌ చేస్తూ రేడియేషన్‌ను టార్గెటెడ్‌గా పంపిస్తాయి. అంటే క్యాన్సర్‌ కణజాలం పైకి మాత్రమే రేడియేషన్‌ వెళ్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి 4 ఫ్రాక్షన్లుగా ఇస్తారు. ఒక ఫ్రాక్షన్‌ను ఎక్కువ డోస్‌తో కూడా ఇస్తున్నారు. ఒకటిన్నర నెల పాటు ఈ రేడియోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫొటాన్ల కన్నా ప్రొటాన్‌ థెరపీ వల్ల సైడ్‌ ఎఫెక్టులు తక్కువ. అదేవిధంగా ఈ రెండింటి కన్నా హెచ్‌ఐటి ద్వారా సైడ్‌ ఎఫెక్టులు మరింత తక్కువ. ఫొటాన్‌ రేడియేషన్‌ పెద్ద ఎత్తులో మొదలై క్యాన్సర్‌ దగ్గరికి వెళ్లేసరికి మందగిస్తుంది. అందుకే దీనికి హై డోస్‌ ఇవ్వాలి. అందువల్ల నార్మల్‌ కణజాలం డ్యామేజ్‌ అవుతుంది. కాబట్టి సైడ్‌ ఎఫెక్టులు ఎక్కువ. కార్బన్‌ అయాన్‌ ట్యూమర్‌ దగ్గర మాత్రమే ఎక్కువ డోస్‌లో ఉండి తరువాత క్రమంగా తగ్గిపోతుంది. కార్బన్‌ అయాన్‌ లోపలికి ప్రవేశించిన తరువాత క్యాన్సర్‌ ట్యూమర్‌ దగ్గర మానిప్యులేట్‌ అవుతుంది. కాబట్టి నార్మల్‌ కణజాలం దెబ్బతినదు. ఇది క్యాన్సర్‌ కణాల డిఎన్‌ఎను డ్యామేజ్‌ చేసి కణాలు చనిపోయేలా చేస్తుంది. ఇలా డ్యామేజ్‌ అయిన డిఎన్‌ఎ అంత తొందరగా రిపేర్‌ కాదు. సెల్‌ డెత్‌ అవకాశం ఎక్కువ. నార్మల్‌ టిష్యూ డ్యామేజ్‌ ఉండదు కాబట్టి సైడ్‌ ఎఫెక్టులు దాదాపుగా ఉండవు. హెచ్‌ఐటి బయలాజికల్‌ ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది. ఇమ్యునోథెరపీ తరువాత కూడా దీన్ని ఇవ్వొచ్చు.