అమరచింత తండాలో మొసలి కలకలం

వనపర్తి జిల్లా అమరచింత పట్టణం సమీపంలోని తండాలో  మొసలి కలకలం రేపింది. పట్టణ శివారులోని పెద్దచెరువు నుంచి భారీసైజు మొసలి వ్యవసాయ పొలాల వద్ద ఉన్న పశువుల కొట్టంలోకి వచ్చింది. పశువుల అరుపులకు స్థానికులు మొసలిని గుర్తించి తాళ్ల సాయంతో బంధించి విద్యుత్‌ స్తంభానికి కట్టేశారు. స్థానికుల సమాచారం మేరకు తండాకు చేరుకున్న అటవీశాఖ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకున్నారు.