విప్రో సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ అబిదలి నీముచ్‌వాలా తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ కంపెనీ చెప్పింది. అయితే కొత్త సీఈవో నియామకం జరిగే వరకు .. అబిదలి తన పదవిలో కొనసాగుతారని ఆ కంపెనీ వెల్లడించింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఇచ్చిన ఫైలింగ్ కంపెనీ ఈ విషయాన్ని తెలియజేసింది. కుటుంబసభ్యుల కోసం అబిదలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఈవో ఎంపిక కోసం కంపెనీ బోర్డు సభ్యులు వేట ప్రారంభించారు.