బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీకి కసరత్తు ప్రారంభం

హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీకి ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 7 తేదీ వరకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆయా శాఖల నుంచి 9వ తేదీ వరకు తమకు ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు.