పల్లె ప్రగతితో గ్రామాలకు కొత్త రూపు: మంత్రి హరీష్ రావు

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు కొత్తరూపును సంతరించుకున్నాయిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇదే స్ఫూర్తితో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మారుద్దామని ఆయన ప్రజలకు సూచించారు. సంగారెడ్డి‌జిల్లాలో పల్లె ప్రగతిపై మంత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడత పల్లె ప్రగతిలో రాష్ట్రంలో
సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించి, రెండో
పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా అగ్రస్థానంలో నిలుద్దామని జిల్లా ప్రజానికానికి మంత్రి సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో సర్పంచ్ ల గౌరవం పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రజల్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయత పొందిన వారే నిజమైన అదృష్టవంతులు, ఐశ్వర్య వంతులని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.